Skip to main content

బ్రిటన్‌లో వీసా నిబంధనల పునరుద్ధరణ

బ్రిటన్ వర్క్ వీసాలో పాత నిబంధనల్ని పునరుద్ధరించాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.
వచ్చే విద్యా సంవత్సరం(2020-21) నుంచి ఈ పాత నిబందనలు అమల్లోకి వస్తాయని సెప్టెంబర్ 11న వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ చదివే విదేశీ విద్యార్థులు డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తయ్యాక 4నెలలు పాటు మాత్రమే ఉండే వీలుంది. తాజాగా వీసా నిబంధనల్ని సవరించడంతో చదువు పూర్తయ్యాక రెండేళ్ల పాటు యూకేలో ఉంటూనే ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.

భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య
ఒకప్పుడు బ్రిటన్‌లో చదువు పూర్తయిన విద్యార్థులు మరో రెండేళ్ల పాటు అదే వీసాపై ఆ దేశంలో కొనసాగే అవకాశం ఉండేది. కానీ థెరిసా మే హోం మంత్రిగా ఉన్నప్పుడు 2012లో విద్యార్థులు రెండేళ్లు పాటు కొనసాగే నిబంధనలను రద్దు చేశారు. దీంతో బ్రిటన్‌కు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 55శాతానికి పడిపోయింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వీసాలో పాత నిబంధనల పునరుద్ధరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Published date : 12 Sep 2019 03:56PM

Photo Stories