బ్రిటన్ పార్లమెంటు రద్దు చట్టవిరుద్ధం
Sakshi Education
బ్రెగ్జిట్ వివాదం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 24న స్పష్టం చేసింది.
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రెగ్జిట్ అంశంపై కొంత కాలంగా బ్రిటన్ పార్లమెంటులో వాడి, వేడి రాజకీయాలు నడుస్తుండగా, ఈ నెల మొదట్లో పార్లమెంటును 5 వారాలపాటు సస్పెండ్ చేస్తూ బోరిస్ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ సంతతి మహిళ గినా మిల్లర్ ఈ అంశంపై కోర్టును ఆశ్రయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్ పార్లమెంటు రద్దు చట్టవిరుద్ధం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : బ్రిటన్ సుప్రీంకోర్టు
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్ పార్లమెంటు రద్దు చట్టవిరుద్ధం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : బ్రిటన్ సుప్రీంకోర్టు
Published date : 25 Sep 2019 05:53PM