బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
Sakshi Education
బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో జరుగుతున్న 11వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ‘సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరో సారి కానుంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో ప్రస్తుతం బ్రెజిల్ ఉంది. ఈ సదస్సు సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సనారో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో వేర్వేరుగా మోదీ సమావేశమయ్యారు.
గణతంత్ర వేడుకల అతిథిగా బొల్సనారో
2020 గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సనారో ప్రత్యేక అతిథిగా రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు గణతంత్ర వేడుకలకు హాజరుకావడానికి బ్రెజిల్ అధ్యక్షుడు అంగీకరించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. భారతీయులు వీసా లేకుండా బ్రెజిల్‌కు ప్రయాణించే సౌకర్యం కల్పించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
మోదీకి పుతిన్ ఆహ్వానం
బ్రిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడంపై ఇద్దరు చర్చించారు. ఈ సందర్భంగా మోదీని పుతిన్ రష్యాకు ఆహ్వానించారు. 2020, మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే ఉత్సవాలకు హాజరుకావాలని మోదీని కోరారు. ఇరుదేశాల వాణిజ్యంలో 17 శాతం వృద్ధి నమోదైందని మోదీ అన్నారు. మరోవైపు చైనాఅధ్యక్షుడు జినపింగ్ సమావేశమైన మోదీ పలు విషయాలపై చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 11వ బ్రిక్స్ సదస్సు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బ్రసీలియా, బ్రెజిల్

Published date : 14 Nov 2019 05:36PM