Skip to main content

బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020 విజేత?

తణుకు ఆంధ్రా షుగర్స్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ కు జాతీయ పురస్కారం ‘‘బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020’’ లభించింది.
Current Affairs
జాతీయ రైతు దినోత్సవం(డిసెంబర్ 23) పురస్కరించుకుని డిసెంబర్ 23న జాతీయ వ్యవసాయ, పరిశోధన మండలి-నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్(హరియాణ) ఈ అవార్డును ప్రదానం చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమం ద్వారా నరేంద్రనాథ్ ఈ అవార్డును అందుకున్నారు. ఒంగోలు జాతి పశు అభివృద్ధి, పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.
 
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : ముళ్లపూడి నరేంద్రనాథ్
ఎందుకు : ఒంగోలు జాతి పశు అభివృద్ధి, పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా
Published date : 25 Dec 2020 06:01PM

Photo Stories