బ్రిడ్‌జిటల్ నేషన్ పుస్తకావిష్కరణ
Sakshi Education
టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ ముఖ్య ఆర్థికవేత్త రూప పురుషోత్తం రచించిన ‘బ్రిడ్‌జిటల్ నేషన్’( బ్రిడ్‌జిటల్ ఇండియా) పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 20న ఆవిష్కరించారు.
న్యూఢిల్లీలోని మోదీ అధికారిక నివాసంలో నిర్వహించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... టెక్నాలజీని చెడుగా చూపించే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌స, మానవుల ఉద్దేశ్యాల మధ్య వారధి ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై చర్చ ఉండాలన్నారు. ఆకాంక్షలు, సాధనల మధ్య, డిమాండ్, డెలివరీ మధ్య, ప్రభుత్వం, పాలన మధ్య టెక్నాలజీ వారధిని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిడ్‌జిటల్ నేషన్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిడ్‌జిటల్ నేషన్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 21 Oct 2019 06:10PM