బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించిన రెండు వెర్షన్లను భారత రక్షణ శాఖ డిసెంబర్ 17న విజయవంతంగా పరీక్షించింది. వీటిలో ఒకటి భూతలం నుంచి, రెండోది గగనతలం నుంచి ప్రయోగించేది కావడం విశేషం.
మొదటి రకం : చాందీపూర్(ఒడిశా) లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని లాంచ్ ప్యాడ్3 నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేలా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి(మొదటి రకం)ని ప్రయోగించారు.
రెండో రకం : గాలిలోని లక్ష్యాలనుఛేదించగల రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి(రెండో రకం)ని ఐఏఎఫ్ యుద్ధ విమానాన్ని టార్గెట్‌గా చేసుకుని ప్రయోగించారు. కలైకుండ ఎయిర్‌బేస్(పశ్చిమబెంగాల్) నుంచి ఎగిరిన ఐఏఎఫ్ యుద్ధ విమానాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. దీనిని దీనిని ఎయిర్‌ఫోర్స్ వేరియంట్ బ్రహ్మోస్ క్షిపణి బంగాళఖాతం సమీపంలో ఛేదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : చాందీపూర్, ఒడిశా

Published date : 18 Dec 2019 05:48PM