Skip to main content

బొగ్గుగనుల మంత్రిత్వశాఖతో ఏపీఎండీసీ ఒప్పందం

జార్ఖండ్ రాష్ట్రంలోని అరుదైన కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ కోల్ బ్లాక్)ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కైవసం చేసుకుంది.
Current Affairs

బిడ్డింగ్‌లో ఏపీఎండీసీ ఎల్1గా నిలవడంతో ఆ బొగ్గు క్షేత్రాన్ని ఏపీఎండీసీకి అప్పగించారు. ఈ మేరకు జనవరి 11న ఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ - ఏపీఎండీసీ మధ్య ఒప్పందం కుదిరింది.

అత్యంత నాణ్యమైన, అరుదైన బొగ్గు

  • జార్ఖండ్‌లోని గిరిడీ కోల్ ఫీల్డ్స్‌లో అత్యంత నాణ్యమైన, అరుదైన ఎస్1 రకం కుకింగ్ కోల్ ఉంది.
  • దేశంలో వినియోగమయ్యే ఎస్1 రకం బొగ్గులో 1.5 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 98.5 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది.
  • ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నేస్ (ఉక్కును కరిగించడం) కోసం దీనిని వినియోగిస్తారు.


ఏపీఎండీసీకి 48.25 శాతం...

  • ఏపీఎండీసీకి లభించిన బహ్మదిహ బోగ్గు గనిలో 25 లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా.
  • బ్రహ్మదిహ క్షేత్రంలో తవ్వే బొగ్గు అమ్మకం ధరలో 41.75 శాతం జార్ఖండ్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 48.25 శాతం ఏపీఎండీసీదన్నమాట.
  • బ్రహ్మదిహ బొగ్గు గనిని పొందడంవల్ల ఏపీఎండీసీకి రూ.250 నుంచి రూ.350 కోట్ల వరకు నికర రాబడి వస్తుందని అధికారుల అంచనా.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ
ఎందుకు : జార్ఖండ్ రాష్ట్రంలోని కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ కోల్ బ్లాక్) నిర్వహణకు
Published date : 12 Jan 2021 05:50PM

Photo Stories