Skip to main content

బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి ప్రదానం

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 26న బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు.
Current Affairsభారత్‌లో కరోనా మహమ్మారి బయటపడ్డాక మోదీ మరో దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఢాకాలోని నేషనల్‌ పరేడ్‌ స్క్వేర్‌లో బంగ్లా 50వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు బంగబంధు శత జయంతి వేడుకల్లో అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్, ప్రధానమంత్రి షేక్‌ హసీనాతోపాటు మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటంలో భారత సైన్యం పోషించిన పాత్రను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌ అమర వీరుల రక్తం, భారత సైనికుల రక్తం కలిసి పారుతున్నాయని చెప్పారు.

బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి
బంగబంధు, బంగ్లాదేశ్‌ జాతిపిత, దివంగత షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి బహుమతి–2020ని ఆయన కుమార్తెలు షేక్‌ రెహానా, షేక్‌ హసీనాకు ప్రధాని మోదీ అందజేశారు. అనంతరం ఢాకాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావర్‌లోని జాతీయ అమరవీరుల స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
Published date : 29 Mar 2021 12:54PM

Photo Stories