Skip to main content

‘బ్లూఫాక్స్ - మినర్వా’ ఎండీ విజయవర్ధన్‌రెడ్డి కన్నుమూత

హిమాయత్‌నగర్ (హైదరాబాద్): తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన ‘మినర్వా’గ్రూప్ ఎండీ విజయవర్ధన్ రెడ్డి(63) కన్నుమూశారు.
Current Affairs

కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 23వ తేదీ రాత్రి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 24వ తేదీన కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. 1982 హిమాయత్‌నగర్‌లో ‘బ్లూఫాక్స్’పేరుతో వెజ్, నాన్‌వెజ్ రెస్టారెంట్‌ని స్థాపించారు. ఆ తర్వాత అక్కడే 1987లో ‘మినర్వా కాఫీ’ని ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి సికింద్రాబాద్, సోమాజిగూడ, కొంపల్లి, బంజారాహిల్స్ సినీ మ్యాక్స్, కొండాపూర్ బ్రాంచ్‌లను ప్రారంభించారు. తొలి త్రీస్టార్ హోటల్‌గా ‘బ్లూఫాక్స్-మినర్వా’కు గుర్తింపు రావడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, తిరుపతి, నెల్లూరులలో కూడా ఆయన హోటల్స్‌ను స్థాపించారు. హోటల్స్‌తో పాటు విద్యా సంస్థలను సైతం స్థాపించి సుమారు 5 వేల మందికి జీవనోపాధి కల్పించారు.

క్విక్ రివ్వూ :
ఏమిటి : ‘బ్లూఫాక్స్-మినర్వా’ఎండీ విజయవర్ధన్‌రెడ్డి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 23వ తేదీన
ఎవరు : విజయవర్ధన్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్య కారణంతో

Published date : 26 Oct 2020 04:35PM

Photo Stories