బ్లాక్ ఫంగస్‌కు సెలాన్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన ఔషధం?
Sakshi Education
స్పెషాలిటీ బయోఫార్మాస్యూటికల్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్ బ్లాక్ ఫంగస్‌కు (మ్యుకోర్‌మైకోసిస్) ప్రత్యామ్నాయ ఔషధాన్ని తయారు చేసింది.
బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే లిపోసోమాల్ యాంఫోటెరిసిన్–బి ఔషధానికి కొరత ఉన్న నేపథ్యంలో.. ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్–బి ఫార్ములేషన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మూడు వారాల్లోనే కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి బృందం దీనికి రూపకల్పన చేసిందని సెలాన్ ల్యాబ్స్ ఎండీ ఎం.నగేశ్ కుమార్ మే 31న తెలిపారు. సెలాన్‌ను లండన్‌కు చెందిన కెలిక్స్ బయో ప్రమోట్ చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్–బి ఫార్ములేషన్‌అందుబాటులోకి తెచ్చిన సంస్థ?
ఎప్పుడు : మే 31
ఎవరు : హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్
ఎందుకు :బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్–బి ఫార్ములేషన్‌అందుబాటులోకి తెచ్చిన సంస్థ?
ఎప్పుడు : మే 31
ఎవరు : హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్
ఎందుకు :బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం...
Published date : 02 Jun 2021 06:15PM