Skip to main content

బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం

2002లో గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేసు విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ అధికారులకు పెన్షన్ ప్రయోజనాలు నిలిపివేయాలని.. బాంబే హైకోర్టు దోషిగా తేల్చిన ఐపీఎస్ అధికారికి రెండు ర్యాంకులు తగ్గించాలని (డిమోట్) వెల్లడించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 23న ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఆనాడు ఏం జరిగింది?
గోద్రా అల్లర్ల సమయంలో 2002 మార్చి 3న అహ్మదాబాద్ దగ్గర్లోని రాధికాపూర్‌లో బానోపై గ్యాంగ్‌రేప్ జరిగింది. ఆమె కుటుంబసభ్యులు 14 మందిని అత్యంత పాశవికంగా హతమార్చారు. మృతుల్లో ఆమె తల్లి, రెండేళ్ల కూతురు ఉన్నారు. ఘటన జరిగినపుడు బానో 5నెలల గర్భిణి. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతోంది. బానోకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె తిరస్కరించి, సుప్రీంకోర్టులో కేసువేసింది. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు పోలీసు అధికారులు, ఓ ప్రభుత్వ డాక్టరు సహా 19 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 24 Apr 2019 05:08PM

Photo Stories