బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ విలీనం
Sakshi Education
భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్(ఎంటీఎన్‌ఎల్)ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఈ రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అక్టోబర్ 22న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
టెలికం సంస్థల విలీనం-కేబినెట్ నిర్ణయాలు
టెలికం సంస్థల విలీనం-కేబినెట్ నిర్ణయాలు
- బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్‌ఎల్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది.
- పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించుకోవచ్చు.
- రెండు సంస్థల్లోని దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్‌ఎస్ పథకం అమలు.
- ఈ రెండు సంస్థలకు రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కోసం రూ. 3,674 కోట్లు కేటాయింపు.
- రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయడం.
Published date : 24 Oct 2019 05:45PM