Skip to main content

బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్‌గా స్టోక్స్

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 2019 ఏడాది ప్రతిష్టాత్మక బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ‘స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు.
Current Affairs2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఒక క్రికెటర్ అత్యుత్తమ ఆటగాడి పురస్కారాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం నిర్ణయించిన ఈ అవార్డులో స్టోక్స్ తర్వాత ఫార్ములావన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు రెండో స్థానం దక్కింది.

టీమ్ ఆఫ్ ద ఇయర్‌గా ఇంగ్లండ్
బీబీసీ అవార్డుల్లో ప్రపంచ కప్ గెలుచుకున్న ఇంగ్లండ్ వన్డే జట్టు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది. ప్రపంచ కప్‌లో సూపర్ ఓవర్ చివరి బంతికి స్టంప్స్‌ను పడగొట్టి గప్టిల్‌ను కీపర్ బట్లర్ రనౌట్ చేసిన క్షణం ‘గ్రేటెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్’ అవార్డుకు ఎంపికైంది.

ఐదుగురు క్రికెటర్లు మాత్రమే
గ్రేట్ బ్రిటన్ తరఫున వివిధ రంగాల్లో అసమాన ప్రదర్శన కనబర్చిన వారికి బీబీసీ ప్రతీ ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. 1954లో నెలకొల్పిన బీబీసీ స్పోర్‌‌ట్స అవార్డుల్లో ఇప్పటివరకు ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో జిమ్ లేకర్ (1956లో), డేవిడ్ స్టీలీ (1975లో), ఇయాన్ బోథమ్ (1981లో), ఆండ్రూ ఫ్లింటాఫ్ (2005లో) ఈ అవార్డును పొందారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2019 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : బెన్ స్టోక్స్
Published date : 17 Dec 2019 05:47PM

Photo Stories