బిహార్‌లో 5 కోట్ల మంది మానవహారం
Sakshi Education
పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభుత్వానికి మద్దతుగా బిహార్‌లో 5.17 కోట్ల మంది కలసి జనవరి 19న భారీ మానవహారం ఏర్పాటు చేశారు.
ఈ చైన్ దాదాపు 18,034 కిలోమీటర్ల పొడవుంది. 2017, 18లలో మద్యనిషేధం, వరకట్నం-బాల్యవివాహాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మానవహారం కంటే ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ మానవహారం పొడవు 2018 కంటే 14 వేల కిలోమీటర్లు, 2017 కంటే 11 వేల కిలోమీటర్లు అధికం. 2017లో మొదటిసారి మొదలైన ఈ మానవ హారం అప్పట్లోనే గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో బంగ్లాదేశ్ రికార్డును అధిగమించిందని అధికారులు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 5.17 కోట్ల మంది మానవహారం
ఎప్పుడు : జనవరి 19
ఎక్కడ : బిహార్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 5.17 కోట్ల మంది మానవహారం
ఎప్పుడు : జనవరి 19
ఎక్కడ : బిహార్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం
మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం బిహార్ రాష్ట్ర గవర్నర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు?
1. బీడీ మిశ్రా
2. జగదీశ్ ముఖి
3. సత్యపాల్ మాలిక్
4. పాగు చౌహాన్
- View Answer
- సమాధానం : 4
Published date : 20 Jan 2020 05:50PM