Skip to main content

బెంగళూరు రాప్టర్స్‌కు పీబీఎల్ టైటిల్

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)-2020 టైటిల్‌ను బెంగళూరు రాప్టర్స్ జట్టు కైవసం చేసుకుంది.
Current Affairsహైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫిబ్రవరి 9న జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టు 4-2తో తొలిసారి ఫైనల్ చేరిన నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టును ఓడించింది. విజేత బెంగళూరు జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. రన్నరప్ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీఫైనల్స్‌లో ఓడిన పుణే సెవెన్ ఏసెస్, చెన్నై సూపర్ స్టార్స్ జట్లకు రూ. 75 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.

సిక్కి రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద లీగ్ పురస్కారం
లీగ్ దశలో నిలకడగా ఆడిన హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డికి ‘ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ పురస్కారం లభించింది. తై జు యింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టైటిల్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : బెంగళూరు రాప్టర్స్ జట్టు
ఎక్కడ : జీఎంసీ బాలయోగి స్టేడియం, హైదరాబాద్
Published date : 10 Feb 2020 05:59PM

Photo Stories