బార్సిలోనాఎఫ్‌సీ కోచ్‌గా రొనాల్డ్ కోమన్
Sakshi Education
స్పెయిన్ కేంద్రంగా ఉన్న బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) నూతన కోచ్ గా రొనాల్డ్ కొమన్నియమితులయ్యారు.
ఈ విషయాన్ని క్లబ్ యాజమాన్యం ఆగస్టు 19న ఒక ప్రకటన ద్వారా తెలిపింది. నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ ఆటగాడైన రొనాల్డ్ రెండేళ్ల పాటు బార్సిలోనాఎఫ్‌సీ కోచ్ పదవిలో కొనసాగుతాడు. 1989–95 మధ్య బార్సిలోనా జట్టుకు కూడా ఆడాడు. రొనాల్డ్ తన ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం నెదర్లాండ్స్ జట్టుకు కోచ్‌గా పనిచేయడంతో పాటు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ జట్లు సౌతాంప్టన్, ఎవర్టన్లకు కూడా కోచ్‌గా సేవలు అందించాడు.
స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ‘ల లీగ’లోబార్సిలోనాఎఫ్‌సీకి ప్రత్యేక స్థానం ఉంది. 120 ఏళ్ల చరిత్ర కలిగిన బార్సిలోనాఎఫ్‌సీ... ఇప్పటి వరకు ‘ల లీగ’ టైటిల్‌ను 26 సార్లు, చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను 5 సార్లు కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) నూతన కోచ్గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : రొనాల్డ్ కొమన్
ఎక్కడ :బార్సిలోనా, స్పెయిన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) నూతన కోచ్గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : రొనాల్డ్ కొమన్
ఎక్కడ :బార్సిలోనా, స్పెయిన్
Published date : 20 Aug 2020 05:24PM