బాంబే జయశ్రీకి మంగళంపల్లి పురస్కారం
Sakshi Education
ఫ్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీకి 2019 సంవత్సరానికిగాను పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసింది.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం, రూ.పది లక్షలు, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజనాభ్యుదయ, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాంస్కృతిక శాఖకు రూ.72 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చి ఈ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాంబే జయశ్రీకి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారం-2019 ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాంబే జయశ్రీకి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారం-2019 ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 12 Aug 2019 05:45PM