Skip to main content

బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా దిపాంకర్‌ దత్తా

బాంబే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దిపాంకర్‌ దత్తా ఏప్రిల్ 28న ప్రమాణ స్వీకారం చేశారు.
Current Affairs
మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొష్యారి ఆయనతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హాజరయ్యారు. ఇప్పటి వరకూ పని చేసిన జస్టిస్‌ భూషణ్‌ ధర్మాధికారి ఏప్రిల్ 27న రిటైరయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన దిపాంకర్‌ దత్తా 1965 ఫిబ్రవరి 9న జన్మించారు. 1989 నవంబర్‌ 14న న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరించారు. కలకత్తా హైకోర్టు శాశ్వత జడ్జిగా 2006 జూన్‌ 22న నియమితులయ్యారు. కలకత్తాలో జడ్జి కావడానికి ముందు గువాహతి హైకోర్టు, జార్ఖండ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులో 16 సంవత్సరాలు పని చేశారు. రాజ్యాంగం, కార్మికులు, సర్వీసు విభాగాల్లో నిపుణులైన జస్టిస్‌ దిపాంకర్ సెంట్రల్‌ గవర్నమెంట్‌ కౌన్సిల్‌ గానూ, యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్, వెస్ట్‌ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్లలో లాయర్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : బాంబే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : జస్టిస్‌ దిపాంకర్‌ దత్తా
Published date : 29 Apr 2020 08:27PM

Photo Stories