Skip to main content

అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్‌

దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ తొలి స్థానంలో నిలిచింది.
Current Affairs
ఇండోర్ తర్వాత సూరత్, నవీముంబైలు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు 4,242 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్-2020’ ర్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. స్వచ్ఛ మహోత్సవ్‌ సందర్భంగా ఆగస్టు 20న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వెల్లడించారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం...
  • 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్‌ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి.
  • ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది.
  • దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్‌ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికైంది.
  • - పౌరుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది.
  • పౌరుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్‌ ఎంపికైంది.
  • ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ మొదటి ర్యాంకు సాధించింది.

అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి)
 
  1. ఇండోర్
  2. సూరత్‌
  3. నవీముంబై
  4. విజయవాడ
  5. అహ్మదాబాద్‌

అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి)
 
  1. కరాడ్‌
  2. సస్వద్
  3. లోనావాలా

పరిశుభ్రమైన రాష్ట్రం(
100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ)
  1. ఛత్తీస్‌గఢ్
  2. మహారాష్ట్ర
  3. మధ్యప్రదేశ్‌

పరిశుభ్రమైన రాజధాని..
  1. న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌

కంటోన్మెంట్‌లలో పరిశుభ్రమైనవి
 
  1. జలంధర్‌ కంటోన్మెంట్‌ బోర్డ్
  2. ఢిల్లీ కంటోన్మెంట్‌ బోర్డ్
  3. మీరట్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌

క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఇండోర్‌
ఎక్కడ : మధ్యప్రదేశ్
Published date : 26 Aug 2020 12:33PM

Photo Stories