అత్యంత పెద్ద వయస్కుడు నొనాకాకన్నుమూత
Sakshi Education
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడు, జపాన్‌కు చెందిన మసాజో నొనాకా(113) జనవరి 20న కన్ను మూశారు.
2018, ఏప్రిల్‌లో నొనాకాను సజీవంగా ఉన్న అత్యంత వృద్ధ పురుషునిగా గిన్నిస్ బుక్ గుర్తించింది. అప్పుడు ఆయన వయసు 112 ఏళ్ల 259 రోజులు. 1905లో జపాన్ లోని హొక్కాయిడో దీవిలో నొనాకా జన్మించాడు. ప్రపంచంలోనే సజీవంగా ఉన్న అతిపెద్ద వయసున్న మనిషిగా రికార్డులకెక్కిన 116 ఏళ్ల కేన్ తనాకా(మహిళ) కూడా జపాన్‌కు చెందిన వారే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : మసాజో నొనాకా(113)
ఎక్కడ : జపాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : మసాజో నొనాకా(113)
ఎక్కడ : జపాన్
Published date : 21 Jan 2019 06:27PM