ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి రూ.2,23,846కోట్లు
Sakshi Education
2021-22 ఆర్థిక ఏడాకిగానూ పార్లమెంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ... "కరోన వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు.
భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్ అందిస్తాం. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌ల ఏర్పాటు.ఆత్మ నిర్భర్ భారత్ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97 కోట్లతో ప్రత్యేక నిధి. ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి రూ.2,23,846కోట్లు. అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థారణ కేంద్రాలు ఏర్పాటు" చేస్తామని తెలిపారు.
బడ్జెట్ ప్రసంగంలోని మరిన్ని అంశాలు
- నేషనల్ ఫస్ట్‌లో రైతుల ఆదాయం రెట్టింపు.
- మహిళా సాధికారత, యువత ఉపాధికి అధిక ప్రాధాన్యం.
- కొత్తగా నగర్ స్వచ్ఛ భారత్ మిషన్.
- మెగా టెక్స్‌టైల్స్ పార్కుల నిర్మాణం.
- రానున్న మూడేళ్లలో 7 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు.
- తుక్కు వాహనాల రద్దు.. అధునాతన వాహనాల వినియోగం.
- 15ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కు కింద మార్చే పథకం.
- వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు.
- ఆర్థికరంగ పరిపుష్టికి మరిన్ని చర్యలు. డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ సంస్థల కోసం ప్రత్యేక బిల్లు.
- సరకు రవాణాకు ప్రత్యేకమైన రైలు మార్గం ఏర్పాటు.
- మౌలిక సౌకర్యాలపై రాష్ట్రాలు కూడా పెట్టుబడులు పెట్టాలి.
Published date : 01 Feb 2021 11:54AM