అటల్ భూజల్ యోజన ప్రారంభం
Sakshi Education
సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం రూపొందించిన ‘అటల్ భూజల్ (అటల్ జల్) యోజన’ను ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో డిసెంబర్ 25న ప్రారంభించారు.
ఈ పథకాన్ని ఏడు (మహారాష్ట్ర, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక) రాష్ట్రాల్లోని 78 జిల్లాలు, 8,300 గ్రామాల్లో అమలు చేయనున్నారు.
అటల్ జల్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఐదేళ్లపాటు అమలయ్యే ఈ పథకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మెరుగైన సాగుపద్ధతులు పాటించడం, నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతులు జల సంరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. నీటిని పొలాలకు మళ్లించేందుకు ఇప్పటికీ పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అటల్ భూజల్ (అటల్ జల్) యోజన ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : భూగర్భ జలాల యాజమాన్యం కోసం

Published date : 26 Dec 2019 05:49PM