ఆస్తుల వేలానికి ఈ-బిక్రయ్ పోర్టల్ ప్రారంభం
Sakshi Education
ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా అభివృద్ధి చేసిన ఏకీకృత పోర్టల్ ‘ఈ-బిక్రయ్’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 2న ప్రారంభించారు.
గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పీఎస్‌బీలు రూ.2.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని మరింత పారదర్శకంగా వేలం వేసి, అదనపు విలువను పొందేందుకు వీలుగా ఈ-బిక్రయ్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఈ-ఆక్షన్ పోర్టళ్లకు ఇది అనుసంధానంగా వ్యవహరిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ-బిక్రయ్ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు : ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ-బిక్రయ్ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు : ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా
మాదిరి ప్రశ్నలు
1. జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (నేషనల్ ఇన్ఫ్రాస్టక్చ్రర్ పైప్లైన్-ఎన్ఐపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో ఎన్ని రూ. లక్షల కోట్ల పెట్టుబడులను గుర్తించింది.
1. 105
2. 108
3. 102
4. 104
- View Answer
- సమాధానం : 3
2. ఎన్ఐపీలో భాగంగా ప్రాజెక్టుల్లో రాష్ట్రాల వాటా ఎంత శాతం?
1. 32
2. 29
3. 22
4. 39
- View Answer
- సమాధానం : 4
Published date : 03 Jan 2020 05:46PM