ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
Sakshi Education
ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు.
ఆస్ట్రియాలోని స్పీల్‌బర్గ్‌లో జూలై 4న జరిగిన ఈ రేసులో వెర్‌స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించి నిర్ణీత 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 23 నిమిషాల 54.543 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ రేసుకు ముందు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి, స్టిరియన్ గ్రాండ్‌ప్రిలలో వెర్‌స్టాపెన్‌నే విజయం వరించింది. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, లాండో నోరిస్ (మెక్‌లారెన్) మూడో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచారు. సీజన్‌లో తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి 2021, జూలై 18న జరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
ఎప్పుడు : జూలై 4
ఎవరు : రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : స్పీల్‌బర్గ్, ఆస్ట్రియా
Published date : 05 Jul 2021 05:33PM