ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా జొకోవిచ్
Sakshi Education
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా సెర్బియాకి చెందిన నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలో జనవరి 27న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 6-3తో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. జొకోవిచ్ గతంలో ఆరుసార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016) ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
విజేత జొకోవిచ్‌కు 41 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 87 లక్షలు)... రన్నరప్ నాదల్‌కు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 43 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో పీట్‌సంప్రాస్ (అమెరికా-14)ను వెనక్కి నెట్టి జొకోవిచ్ (15) మూడో స్థానానికి ఎగబాకాడు. ఫెడరర్ (20), రాఫెల్ నాదల్ (17) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
పురుషుల డబుల్స్ విభాగంలో...
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ నికొలస్ మహుట్-పియరీ హ్యూస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో మహుట్-హెర్బర్ట్ జోడీ 6-4, 7-6 (7/2)తో 12వ సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : నొవాక్ జొకోవిచ్
ఎక్కడ : రాడ్ లేవర్ ఎరీనా, మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా

Published date : 28 Jan 2019 06:29PM