Skip to main content

ఆస్ట్రేలియాలో ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్

ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్ 11వ ఎడిషన్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది.
Current Affairsఈ మెగా టోర్నీని అక్టోబర్ 10 నుంచి 17 వరకు మెల్‌బోర్న్‌లోని కాసే స్టేడియం, సిటీ పవర్ సెంటర్లలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జనవరి 22న వరల్డ్ ఇండోర్ క్రికెట్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. చివరగా 2017లో జరిగిన ఈ టోర్నీకి దుబాయి ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నమెంట్‌లో 10 దేశాల నుంచి అండర్-21 పురుషులు, మహిళలు, ఓపెన్ పురుషులు, మహిళలు విభాగాల్లో జట్టు పోటీపడతాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్ 11వ ఎడిషన్
ఎప్పుడు : జనవరి 22
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 23 Jan 2020 05:34PM

Photo Stories