Skip to main content

అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలపై కొత్త నిబంధన

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదన్న ‘కొత్త నిబంధన’ను అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
అస్సాం ముఖ్యమంత్రి సర్బోనందా సోనోవాల్ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధన ప్రకారం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా గుర్తిస్తారు. అలాగే ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వారికి వర్తించవు. ఎవరైనా ఉద్యోగంలో చేరిన తర్వాత మూడో బిడ్డను కంటే వారిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి ఈ నిబంధన వర్తిస్తుంది.

ఈ కొత్త నిబంధనకు సంబంధించిన తీర్మానం అసోం జనాభా, మహిళా సాధికారిత విధానం పేరిట 2017లోనే అసెంబ్లీ ఆమోదం పొందింది. జనాభా నియంత్రణలో భాగంగానే కొత్త నిబంధన అమలు నిర్ణయం తీసుకున్నామని అసోం కేబినెట్ వెల్లడించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : అస్సాం ప్రభుత్వం
ఎక్కడ : అస్సాం
ఎందుకు : జనాభా నియంత్రణలో భాగంగా
Published date : 23 Oct 2019 05:59PM

Photo Stories