Skip to main content

ఆసియా షూటింగ్‌లో మను భాకర్‌కు స్వర్ణం

ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ మను భాకర్‌కు స్వర్ణ పతకం లభించింది.
ఖతర్ రాజధాని దోహాలో నవంబర్ 5న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం ఫెనల్లో హరియణాకు చెందిన 17 ఏళ్ల మను 244.3 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. కియాన్ వాంగ్ (చైనా-242.8 పాయింట్లు) రజతం నెగ్గగా... రాన్‌జిన్ జియాంగ్ (చైనా-220.2 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది.

మరోవైపు వివాన్ కపూర్, మనీషా కీర్‌లతో కూడిన భారత జట్టు జూనియర్ ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఇలవేనిల్ వలారివన్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలాలతో కూడిన భారత బృందం 1883.2 పాయింట్లతో రజతం సాధించింది. మను భాకర్, యశస్విని (578), అన్ను రాజ్ సింగ్ (569)లతో కూడిన భారత బృందానికి టీమ్ విభాగంలో కాంస్యం లభించింది. అలాగే పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్ కాంస్య పతకం నెగ్గడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాడు.

2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించిన భారత షూటర్లు
  • మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) : అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా
  • పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) : సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ
  • పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) : దివ్యాంశ్ సింగ్ పన్వర్, దీపక్ కుమార్
  • పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (1) : సంజీవ్ రాజ్‌పుత్
  • మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ (1) : రాహీ సర్నోబత్
  • మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) : మను భాకర్, యశస్విని సింగ్
క్విక్ రివ్యూ :
 ఏమిటి :
ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
 ఎప్పుడు : నవంబర్ 5
 ఎవరు : మను భాకర్
 ఎక్కడ : మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం
Published date : 06 Nov 2019 06:12PM

Photo Stories