Skip to main content

ఆసియా రెజ్లింగ్‌లో రవి దహియాకు పసిడి పతకం

ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఢిల్లీలో ఫిబ్రవరి 22న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు లభించాయి.
Current Affairs57 కేజీల విభాగంలో రవి దహియా పసిడి పతకం నెగ్గాడు. ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో హిక్మతుల్లో వొహిదోవ్ (తజికిస్తాన్)పై గెలిచాడు. బౌట్ ముగియడానికి 2 నిమిషాల 32 సెకన్లు ఉందనగా రవి 10-0తో ఆధిక్యం సంపాదించడంతో నిబంధనల ప్రకారం రిఫరీ భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు.

65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ (భారత్) 2-10తో టకుటో ఒటుగోరో (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. అలాగే 79 కేజీల విభాగం ఫైనల్లో గౌరవ్ బలియాన్ (భారత్) 5-7తో బుడజపోవ్ (కిర్గిస్తాన్) చేతిలో... 97 కేజీల విభాగం ఫైనల్లో సత్యవర్త్ కడియాన్ (భారత్) 0-10తో ముజ్తబా (ఇరాన్) చేతిలో ఓడిపోయి రజత పతకాలతో సంతృప్తి పడ్డారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : రవి దహియా
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 24 Feb 2020 06:03PM

Photo Stories