అరుదుగా లభించే తిమింగలం వాంతిని ఏ పేరుతో పిలుస్తారు?
Sakshi Education
సముద్రాల్లో అత్యంత అరుదుగా లభించే తిమింగలం వాంతి ‘‘అంబర్‌గ్రిస్’’ బెంగళూరులో పెద్దమొత్తంలో పట్టుబడింది.
అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీ ముడిపదార్థంగా అంబర్‌గ్రిస్‌కు పేరుంది.బెంగళూరు కేజీహళ్లి పోలీసులు సయ్యద్ తజ్ముల్‌పాషా (54), సలీంపాషా (48), నాసీర్ పాషా(34), రఫీవుల్లా షరీఫ్ (45) అనే నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 కేజీల అంబర్‌గ్రిస్ ముద్దలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8 కోట్ల వరకూ ఉంటుంది. వీరికి అంబర్‌గ్రిస్ ఎక్కడ నుండి వచ్చిందనేది విచారణ చేపట్టారు. భారత వన్యప్రాణి చట్టాల ప్రకారం ఇది రక్షిత పదార్థం.
స్పెర్మ్ వేల్ నుంచి...
స్పెర్మ్ వేల్ అనే ఒక రకం తిమింగలం... స్క్విడ్‌లు, కటిల్‌ఫిష్ అనే సముద్ర జీవులను తిన్నప్పుడు వాటి ఎముకలు జీర్ణకోశంలో అరగకుండా ఉండి కొంతకాలానికి గడ్డకడతాయి. కొన్ని రసాయన చర్యల అనంతరం... తిమింగలం దాన్ని బయటకు ఉమ్మేస్తుంది. ఇది కొన్నిసార్లు 15 నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. ఒక రకమైన సువాసన వెదజల్లే ఈ పదార్థాన్ని అమెరికా, యూరప్ దేశాల్లో ఖరీదైన పరిమళాల తయారీలో ఉపయోగిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సముద్రాల్లో అత్యంత అరుదుగా లభించే తిమింగలం వాంతి ‘‘అంబర్‌గ్రిస్’’ పట్టివేత
ఎప్పుడు : జూన్ 9
ఎవరు :బెంగళూరు కేజీహళ్లి పోలీసులు
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు:భారత వన్యప్రాణి చట్టాల ప్రకారం అంబర్‌గ్రిస్ రక్షిత పదార్థం అయినందున...

Published date : 10 Jun 2021 07:03PM