ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
Sakshi Education
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ (నెఫ్ట్)పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్‌బీఐ జూన్ 6న అమలుపరిచింది.
వీటిద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్‌టీజీఎస్ వినియోగంలో ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ నెఫ్ట్ లావాదేవీలపై రూ.1-5 వరకు, ఆర్‌టీజీఎస్‌పై రూ.5-50 వరకు చార్జ్ చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా
Published date : 07 Jun 2019 05:44PM