Skip to main content

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స

కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చింది.
Current Affairs

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఏప్రిల్ 6న ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కింద మరో రూ. 5,631 చెల్లిస్తారు. అంటే మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లిస్తారు. నిర్ధారణ కేసులకు రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకూ కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు.


వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు యాప్‌..

వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలో ప్రత్యేక యాప్‌ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ నేపథ్యంలో లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్నందున పంటలకు ధరల కల్పన, రైతుల ఉత్పత్తుల కొనుగోళ్ల తీరు తెన్నులపై ఏప్రిల్ 6న‌ ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల ద్వారా పంటలు, వాటి పరిస్థితి, ఉత్పత్తి, ధరలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రియల్‌ టైంలో తెలుసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 07 Apr 2020 05:55PM

Photo Stories