ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సురేఖకు స్వర్ణం
Sakshi Education
ప్రతిష్టాత్మక ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది.
ఆర్చరీ కాంపౌండ్ విభాగం మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మతో కలిసి సురేఖ పసిడి పతకాన్ని గెలుచుకుంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 27న జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ (భారత్) జంట 158-151 పాయింట్ల తేడాతో యి సువాన్ చెన్-చియె లున్ చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది.
మరోవైపు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్‌లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని నెగ్గింది. ఫైనల్లో భారత జట్టు 215-231తో చెవన్ సో, యున్ సూ సాంగ్, డేయోంగ్ సియోల్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టుకు కూడా రజతం లభించింది. ఫైనల్లో భారత జట్టు 232-233తో కేవలం పాయింట్ తేడాతో జేవన్ యాంగ్, యోంగ్‌హి చోయ్, యున్ క్యు చోయ్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ విభాగం మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : వెన్నం జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ ద్వయం
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్

Published date : 28 Nov 2019 05:56PM