ఆర్‌ఆర్‌వీఎల్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడులు
Sakshi Education
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్‌ఆర్‌వీఎల్) మరో రెండు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్టోబర్ 3న ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్‌ఆర్‌వీఎల్) పెట్టుబడులు
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : జీఐసీ, టీపీజీ
రిలయన్స్ తెలిపిన వివరాల ప్రకారం...
- ఆర్‌ఆర్‌వీఎల్‌లో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా ఆర్‌ఆర్‌వీఎల్‌లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది. డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు.
- మరో అంతర్జాతీయ సంస్థ టీపీజీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్‌ఆర్‌వీఎల్‌లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. 2020 ఏడాది ప్రారంభంలో ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్‌ఆర్‌వీఎల్) పెట్టుబడులు
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : జీఐసీ, టీపీజీ
Published date : 06 Oct 2020 11:45AM