Skip to main content

ఆఫ్రికా దేశం ఘనా రాజధాని నగరం ఏది?

భారత్‌లోని పుణెలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న ‘‘కోవిషీల్డ్‌’’ కోవిడ్‌ వ్యాక్సిన్ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి.
Current Affairs
నిరుపేద దేశాలకు కరోనా టీకా లభ్యమయ్యేలా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన ''కోవాగ్జ్‌'' కార్యక్రమంలో భాగంగా ఈ టీకా డోసుల్ని పంపించారు. కోవాగ్జ్‌ కార్యక్రమం కింద కరోనా టీకా లభించే తొలి దేశం ఘనాయే. యూనిసెఫ్‌ ఆర్డర్‌ చేసిన ఈ కరోనా టీకా డోసులు అక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరి 24న చేరుకున్నాయి. కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యమైన 92 దేశాల్లో ఘనా కూడా ఉంది. ఘనా జనాభా 3 కోట్లు. ఈ దేశంలోఇప్పటివరకు 81 వేల కేసులు, 600మరణాలు సంభవించాయి.

డబ్ల్యూహెచ్‌ఓ, వ్యాక్సిన్ గ్రూప్‌ గవీ, కొయిలేషన్ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్ సంయుక్తంగా పేద దేశాలను ఆదుకోవడానికి కోవాగ్జ్‌ కార్యక్రమం ప్రారంభించాయి.

ఘనా రాజధాని: అక్రా; కరెన్సీ: ఘనా సెడి
ఘనా ప్రస్తుత అధ్యక్షుడు: నానా అకుఫో–అడో
ఘనా ప్రస్తుత ఉపాధ్యక్షుడు: మహాముడు బావుమియా

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఘనా దేశానికి చేరుకున్న ‘‘కోవిషీల్డ్‌’’ టీకాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎక్కడ : అక్రా అంతర్జాతీయ విమానాశ్రయం, ఘనా
ఎందుకు : ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగంగా
Published date : 25 Feb 2021 06:15PM

Photo Stories