Skip to main content

అఫ్గాన్‌కు ఆయుధాల అమ్మకంపై నిషేధం విధించిన దేశం?

తాలిబన్ల పునరాక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి అన్ని రకాల ఆయుధాల విక్రయంపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ మేరకు ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న లేదా ఇంకా అందజేయని ఆయుధాల విషయంలో పునఃసమీక్ష నిర్వహించాలని సూచించింది.

ఆగస్టు, 19న అఫ్గాన్స్వాతంత్య్రదినోత్సవం
1919 ఆగస్టు, 19న బ్రిటీష్‌ వలసపాలకుల నుంచి అఫ్గానిస్తాన్‌కు విముక్తి లభించింది. అప్పట్నుంచి ప్రతీ ఏటా స్వాతంత్య్రదిన వేడుకలు జరుపుకుంటారు. 2021 ఏడాది తాలిబన్లు అఫ్గాన్‌ను వశం చేసుకోవడంతో వారి అరాచకాలను నిరసిస్తూ ప్రజలు రోడ్డెక్కారు.

అఫ్గాన్లో ఇక ఆకలి కేకలే: యూఎన్
అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో కుదేలైపోయిన ఆ దేశంలో తాజాగా నెలకొన్న సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్గాన్‌ డైరెక్టర్‌ మేరి ఎలన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునైనా ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే, 20 కోట్ల అమెరికా డాలర్లు తక్షణావసరమని వివరించారు.

క్విక్రివ్యూ :
ఏమిటి : అఫ్గాన్‌కు ఆయుధాల అమ్మకంపై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : అమెరికా
ఎందుకు : అఫ్గాన్‌ను తాలిబన్ల పునరాక్రమించిన నేపథ్యంలో...

Published date : 20 Aug 2021 06:46PM

Photo Stories