అనంతపురం వైద్యశాలకు రాష్ట్రపతి పురస్కారం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రపతి సేవా పురస్కారం లభించింది.
ఈ మేరకు ఆగస్టు 21న రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను కళాశాలకు ఈ అవార్డు దక్కింది. 2019, సెప్టెంబరు 24న ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రపతి సేవా పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల
ఎందుకు : ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రపతి సేవా పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల
ఎందుకు : ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు
Published date : 22 Aug 2019 05:43PM