అంతర్జాతీయ సదస్సు రైజినా డైలాగ్ ప్రారంభం
Sakshi Education
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ‘రైజినా డైలాగ్’ న్యూఢిల్లీలో జనవరి 14న ప్రారంభమైంది.
ప్రపంచ దేశాల కీలక నేతలు పాల్గొంటున్న ఈ సదస్సులో ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్తాన్‌లో శాంతి, వాతావరణ మార్పు.. తదితర ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తారు. సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని ఆండర్స్ రాస్ముసెన్, న్యూజీలాండ్ పీఎం హెలెన్ క్లార్క్, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జారుు, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, స్వీడన్ మాజీ పీఎం కార్ల్ బ్లిడ్ హాజరయ్యారు.
సదస్సులో డెన్మార్క్‌లో ప్రధాని రాస్ముసెన్ ప్రసంగిస్తూ... ప్రపంచవ్యాప్తంగా నియంత పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలు ఒక అంతర్జాతీయ కూటమి కట్టాలని కోరారు. ఆ కూటమిలో భారత్ కీలకపాత్ర పోషించాలన్నారు. ‘ఈ కూటమిలో భారత్ పాత్ర కీలకం. ప్రధాని మోదీకి నేను అభిమానిని’ అని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ సదస్సు ‘రైజినా డైలాగ్’ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : భారత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్తాన్‌లో శాంతి, వాతావరణ మార్పు వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు
మాదిరి ప్రశ్నలు

1. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ 2020, జనవరి 7న విడుదల చేసిన ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్(హెచ్‌పీఐ)-2020’లో భారత పాస్‌పోర్టుకు ఎన్నవ స్థానం లభించింది?
1. 89వ
2. 84వ
3. 82వ
4. 76వ
- View Answer
- సమాధానం: 2
2. పాస్‌పోర్టు ఇండెక్స్(హెచ్‌పీఐ)-2020లో ఏ దేశ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది?
1. సింగపూర్
2. జర్మనీ
3. జపాన్
4. స్పెయిన్
- View Answer
- సమాధానం: 3
Published date : 17 Jan 2020 05:58PM