అంతర్జాతీయ సౌకర్యాలతో ‘క్లీన్ వార్డ్’ కేంద్రం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏ వైరస్ సోకినా ఒకేచోట వైద్య చికిత్స అందించే ‘క్లీన్‌వార్డు’ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేయనుంది. ముందుగా హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నా, తర్వాత దాన్ని ఛాతీ ఆస్పత్రిలో ఐదెకరాల విశాలమైన స్థలంలో నెలకొల్పాలని నిర్ణయించింది. రూ.132 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో భూమి పూజ చేసి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల మేరకు..
క్లీన్‌వార్డు కేంద్రంలో స్వైన్‌ప్లూ, కరోనా, నిఫా, ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లకు చికిత్స అందిస్తారు. ఈ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నెలకొల్పుతారు. ప్రస్తుతం ఏదైనా వైరస్ సోకితే గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో అప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కోసారి కనీస వసతులు కూడా ఉండకపోవడంతో బాధితులు ఆయా ఆస్పత్రులకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. పైగా ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు వైద్యం అందించే వార్డులనే వైరస్‌లు సోకిన వారికి ప్రత్యేకంగా కేటాయించి చికిత్స చేస్తున్నారు. దీనివల్ల సాధారణ రోగులకు, వైరస్ సోకిన రోగులకు పక్కపక్కనే చికిత్స అందించే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక చికిత్సా కేంద్రం ప్రస్తుతం ఢిల్లీ, పుణేల్లో మాత్రం ఉండగా, త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అంతర్జాతీయ సౌకర్యాలతో తెలంగాణలో ‘క్లీన్ వార్డ్’ కేంద్రం ఏర్పాటు
ఎక్కడ: తెలంగాణ
ఎందుకు: స్వైన్‌ప్లూ, కరోనా, నిఫా, ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లకు చికిత్సకు..

Published date : 30 Jan 2020 06:10PM