Skip to main content

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు జనవరి 4న ఇర్ఫాన్ ప్రకటించాడు.
Current Affairsమేటి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న 35 ఏళ్ల పఠాన్ 2003లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ టెస్టులో అరంగేట్రం చేశాడు. 2012లో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్... 2019 ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీలో జమ్మూకశ్మీర్ తరఫున చివరిసారిగా దేశవాళీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ గణాంకాలు

వివరాలు

టెస్టులు

వన్డేలు

టి20లు

ఆడిన మ్యాచ్‌లు

29

120

24

చేసిన పరుగులు

1105

1544

172

బ్యాటింగ్ సగటు

31.57

23.39

24.57

బౌలింగ్ ఎకానమీ

3.28

5.26

8.02


క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఇర్ఫాన్ పఠాన్

మాదిరి ప్రశ్నలు
Published date : 06 Jan 2020 05:59PM

Photo Stories