Skip to main content

అంకిత జోడీకి ఐటీఎఫ్ టోర్నీ మహిళల డబుల్స్ టైటిల్

భారత మహిళల టెన్నిస్ స్టార్ అంకిత రైనా తన కెరీర్‌లో 19వ డబుల్స్ టైటిల్‌ను సాధించింది.
Current Affairsయూఏఈలోని దుబాయ్‌లో ముగిసిన ఐటీఎఫ్ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో అంకిత (భారత్) -ఎకతెరీనా (జార్జియా) జంట 6-4, 3-6, 10-6 తో జువాన్ కాజా (స్లొవేనియా)-బొల్సోవా (స్పెయిన్) జోడీపై గెలిచింది.

సమగ్ర పారిశ్రామిక సర్వేకి ఎలెట్స్ అవార్డు
దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'సమగ్ర పారిశ్రామిక సర్వే' (ఎస్‌పీఎస్-2020)కి ఎలెట్స్ నాలెడ్‌‌జ ఎక్స్ఛేంజ్ సమ్మిట్ అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే -2020లో భాగంగా డిజిటల్ గవర్నెన్స్లో తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టినందుకుగాను ఏపీ పరిశ్రమల శాఖ డెరైక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పటివరకు సమగ్ర పారిశ్రామిక సర్వే కింద 50 వేలకు పైగా పరిశ్రమల వివరాలను సేకరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీఎఫ్ టోర్నీ మహిళల డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : అంకిత (భారత్) -ఎకతెరీనా (జార్జియా) జంట
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
Published date : 14 Dec 2020 05:47PM

Photo Stories