అంగారక గ్రహంపైకి చైనా పంపిన రోవర్ పేరు?
Sakshi Education
చైనా తన తొలి అంగారక రోవర్ కు ‘‘ఝురాంగ్’’ అని నామకరణం చేసింది. తియాన్ వెన్-1 వ్యోమనౌకలో భాగంగా 2021, ఫిబ్రవరి 24న ఈ రోవర్ అంగారకుడి కక్ష్యలోకి చేరింది.
చైనాలో అగ్ని దేవుడిని సంప్రదాయబద్ధంగా ఝురాంగ్ పిలుస్తారు. 1976లో అమెరికాకు చెందిన వైకింగ్-2 ల్యాండర్ కాలుమోపిన ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ఝురాంగ్ దిగే అవకాశం ఉంది.
చంద్రుడి పైకి చాంగే-6 ...
చంద్రుడి పైకి ‘‘చాంగే-6’’ అనే వ్యోమనౌక 2024లో జాబిల్లి దక్షిణ ధృవానికి సమీపంలో దిగుతుందని చైనా తెలిపింది. తాము ప్రయోగించే ల్యాండర్ లో ఫ్రాన్స్ , స్వీడన్, రష్యా, ఇటలీకి చెందిన పరిశోధన పరికరాలు ఉంటాయని ఏప్రిల్ 25న ప్రకటించింది.అంతరిక్ష కార్యక్రమాలను మరింత విస్తరించి భూ కక్ష్యలో వ్యోమగాములతో కూడిన ఒక రోదసీ కేంద్రాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. అలాగే ఒక గ్రహ శకలం నుంచి నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంగారక గ్రహంపైకి చైనా పంపిన రోవర్?
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ఝురాంగ్
ఎందుకు : అంగారక గ్రహంపై పరిశోధనలు సాగించేందుకు...

Published date : 26 Apr 2021 07:54PM