ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ అగ్రిల్యాబ్స్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఖరీఫ్ నాటికి వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక రాష్ట్రస్థాయి పరీక్షా కేంద్రం, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు, 13 జిల్లాస్థాయి పరీక్షా కేంద్రాలతో పాటు 147 గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు అక్టోబర్ 19న వెల్లడించింది. భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ అగ్రిల్యాబ్స్‌కు ‘నాబార్డు’ ఆర్థిక సాయం చేయనుంది. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వచ్చే ఖరీఫ్ నాటికి వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు)ను ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు

Published date : 21 Oct 2019 05:26PM