ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,750 కోట్ల కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులు
Sakshi Education
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఇన్వెస్ట్ చేయనుంది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : రూ. 1,750 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : కైనెటిక్ గ్రీన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం
ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1,750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ కార్గో 3 వీలర్ సఫర్ జంబో వాహనాన్ని అక్టోబర్ 27న ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ ఈ విషయాలు వెల్లడించారు. భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్ గోల్ఫ్‌కార్టులు, ఇతరత్రా ఎలక్ట్రిక్ ఆఫ్–రోడ్ వాహనాల డిజైన్, తయారీకి సంబంధించి టొనినో లంబోర్గినితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్ గ్రూప్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల ఫార్మా పెట్టుబడులు
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొం దిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అక్టోబర్ 27న ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి కల్ ఫార్ములేషన్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రాష్ట్రంలో మరో రూ. 400 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపులారస్ ల్యాబ్స్ కూడా జీనోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో దశల వారీగా ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లారస్ ల్యాబ్ జీనోమ్ వ్యాలీలోనిఐకేపీ నాలెడ్జ్ పార్కులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : రూ. 1,750 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : కైనెటిక్ గ్రీన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం
Published date : 28 Oct 2020 05:49PM