ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు.
డిసెంబర్ 31న రాష్ట్ర సచివాలయంలో నీలం సాహ్ని నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతర్ రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ఆదిత్యనాథ్‌దాస్ తొలి సంతకం చేశారు.
సాగునీటి శాఖ కార్యదర్శిగా...
ఆదిత్యనాథ్ దాస్ సుదీర్ఘకాలం సాగునీటి శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999 - 2001 వరకు వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2007 వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2016 వరకు సాగునీటి శాఖ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సర్వీసులో కూడా పలు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పటి వరకు జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ఆదిత్యనాథ్ దాస్
ఎందుకు : సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ విరమణ చేసిన నేపథ్యంలో

Published date : 01 Jan 2021 06:07PM