అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం
Sakshi Education
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.
రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ 29నజరిగిన ఓ కార్యక్రమంలో కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారతీయ సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది.
అత్యున్నత పురస్కారం
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. అదే ఏడాది అమితాబ్ ‘సాత్ హిందుస్తానీ’అనే హిందీ సినిమాతో అరంగేట్రం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమితాబ్ బచ్చన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ

Published date : 30 Dec 2019 06:10PM