Skip to main content

అమిత్ షాపై ఆంక్షలు విధించాలి : యూఎస్‌సీఐఆర్‌ఎఫ్

పౌరసత్వ సవరణ బిల్లు-2019ను యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) తప్పు పట్టింది.
Current Affairsఈ బిల్లు తప్పుడు మార్గంలో వెళుతూ అత్యంత ప్రమాదకరంగా మారిందని వ్యాఖ్యానించింది. భారత లౌకికతత్వాన్ని ఈ బిల్లు దెబ్బ తీస్తోందని, సమాన హక్కుల్ని కాలరాస్తోందని పేర్కొంది. మత ప్రాతిపదికన చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న భారత హోం మంత్రి అమిత్, ఇతర నాయకులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణించాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి డిసెంబర్ 10న సూచించింది.
 
 కనీస అవగాహన లేదు : భారత్
 పౌరసత్వ సవరణ బిల్లు-2019పై కనీస అవగాహన లేకుండా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ సూచనలు చేస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఈ అంశంలో ఆ సంస్థ ఈర్ష్య, పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఎదురు దాడికి దిగారు. ఆంక్షలు విధించాలంటూ సిఫార్సులు చేయడం అత్యంత విచారకరమన్న రవీష్ కుమార్ భారత్‌లో చట్టాలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఆ సంస్థకు లేదని అన్నారు.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
భారత హోం మంత్రి అమిత్ షాపై ఆంక్షలు విధించాలి
 ఎప్పుడు :  డిసెంబర్ 10
 ఎవరు : యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్)
 ఎందుకు : పౌరసత్వ సవరణ బిల్లు-2019ను వ్యతిరేకిస్తూ
Published date : 11 Dec 2019 05:43PM

Photo Stories