Skip to main content

అమెరికాలో ఓపీఎం హెడ్‌గా ఎంపికైన భారత సంతతి మహిళ?

దాదాపు 20లక్షల మంది అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే ‘ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ (ఓపీఎం)’ విభాగానికి మహిళా అధినేతగా భారతీయ మూలాలున్న కిరణ్‌ అహూజా వ్యవహరించనున్నారు.
Current Affairs
49 ఏళ్ల కిరణ్‌ అహూజాను ఓపీఎం హెడ్‌గా ఎంపికచేస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గతంలోనే నామినేట్‌ చేశారు. అయితే, ఈ నామినేషన్‌పై సెనేట్‌లో జూన్‌ 22న ఓటింగ్‌ జరిగింది. ఓటింగ్‌లో 50–50 ఓట్లు పడ్డాయి. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ తన నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిరణ్‌కు మద్దతుగా ఓటేశారు. దీంతో కిరణ్‌ పదవి ఖరారైంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అమెరికాలో ఓపీఎం హెడ్‌గా ఎంపికైన భారత సంతతి మహిళ?
ఎప్పుడు : జూన్‌ 23
ఎవరు : కిరణ్‌ అహూజా
ఎందుకు : అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించేందుకు...
Published date : 24 Jun 2021 06:14PM

Photo Stories