Skip to main content

అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులు ఏ నగరంలో సమావేశమయ్యారు?

అగ్రదేశాలు అమెరికా, రష్యాల అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్‌ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం జూన్‌ 16న స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవా వేదికగా జరిగింది.
Current Affairs సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని, తమ ఇద్దరి మధ్య చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని పుతిన్‌ చెప్పారు. ఇరుదేశాల రాయబారులను తమతమ విధుల్లో చేరేందుకు తాను, బైడెన్‌ అంగీకరించామన్నారు.

అంకిత్‌పై నిషేధం తొలగింపు
2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవిత కాల నిషేధానికి గురైన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అంకిత్‌ చవాన్‌కు ఊరట లభించింది. అతనిపై నిషేధం 13 సెప్టెంబర్, 2020తో ముగిసినట్లు... ఇకపై అతను అధికారికంగా క్రికెట్‌ ఆడవచ్చని బీసీసీఐ ప్రకటించింది. జీవితకాల నిషేధం ఉన్నా, బీసీసీఐ నియమించిన అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ జోక్యంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అమెరికా, రష్యాల అధ్యక్షులు సమావేశం
ఎప్పుడు : జూన్‌ 16
ఎవరు : జో బైడెన్, వ్లాదిమిర్‌ పుతిన్‌
ఎక్కడ : జెనీవా, స్విట్జర్‌ల్యాండ్‌
ఎందుకు : ద్వైపాక్షిక, వాణిజ్య, పలు సమకాలీన అంశాలపై చర్చలు జరిపేందుకు...
Published date : 17 Jun 2021 08:47PM

Photo Stories