అమెరికా మత నివేదికపై భారత్ ఆగ్రహం
Sakshi Education
అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారతదేశంలోని ప్రజల రాజ్యాంగహక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 2018లో అంతర్జాతీయ మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికా ప్రభుత్వం జూన్ 21న నివేదిక విడుదల చేసింది. భారత్‌లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. గోమాంసాన్ని రవాణా చేయడం, గోవధ చేశారనే ఆరోపణలతో ముస్లింలపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో చెప్పిన అంశాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ జూన్ 23న ఖండించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా మత నివేదికపై భారత్ ఆగ్రహం
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్
ఎందుకు : భారత్‌లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించడంతో

Published date : 24 Jun 2019 06:33PM